'ముగ్గురం కలిసి ఆమెను చంపేశాం'

1 Jul, 2016 15:05 IST|Sakshi
షీనా బోరా (ఫైల్)

ముంబై: సొంత కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిందని అప్రూవర్గా మారిన డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ వెల్లడించాడు. ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని ఒప్పుకున్నాడు. 2012, ఏప్రిల్ 24న కారులో షీనాకు చంపినట్టు తెలిపాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జట్టు పట్టుకుని కదలకుండా పట్టుకున్నాడని చెప్పాడు. ఇంద్రాణి తన చేతులతో షీనా గొంతు పిసికేసిందని వెల్లడించాడు. పీటర్ ముఖర్జియా ప్రమేయం గురించి అతడు ఏమీ వెల్లడించలేదు.

అయితే ఆయనకు ఎటువంటి సంబంధం లేదని పీటర్ తరపు న్యాయవాది మిహిర్ గీవాలా వాదించారు. 2012, ఏప్రిల్ 24న షీనా హత్యకు గురైనట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ ఆయుధాల కేసులో శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ కావడంతో 2015లో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో రాయ్, ఇంద్రాణి, ఖన్నాను  గతేడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. నవంబర్ లో పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్నారు.

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు