ఆప్‌తో పొత్తు ఉండదు : షీలా దీక్షిత్‌

5 Mar, 2019 14:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో పొత్తు ఉండదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో మం‍గళవారం సమావేశమైన అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ ఈ విషయం వెల్లడించారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీ చేస్తాయని కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఢిల్లీ పార్టీ చీఫ్‌ షీలా దీక్షిత్‌ ప్రకటనతో తెరపడింది.

ఢిల్లీలో బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేయకుండా నిరోధించేందుకు ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు అవసరమని కేజ్రీవాల్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌లు పరస్పరం ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న క్రమంలో ఆప్‌తో పొత్తు పొసగదని సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి తేల్చిచెప్పినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఢిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీచేస్తే దేశరాజధానిలో బీజేపీకి మేలు చేకూరుతుందని ఆప్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు