శివసేన, బీజేపీలో మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం!

23 Sep, 2014 13:48 IST|Sakshi
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై బీజేపీ, శివసేనల మధ్య అవగాహన కుదిరింది. దాంతో పొత్తుపై ఇరుపార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగడంతో బీజేపీ, సేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీకి 130 సీట్లు ఇవ్వడానికి శివసేన అంగీకరించడంతో ఇరుపార్టీల మధ్య పొత్తు ముందుకు కొనసాగడానికి మార్గం సుగమమైంది. 
 
సీట్లు సర్ధుబాటు, ఎన్నికల పొత్తు ముందుకు కొనసాగించడానికి ఇరుపార్టీల నేతలు మంగళవారం ఉదయం భేటి అయ్యారు. అయితే సీట్ల సర్ధుబాటు విషయంలో శివసేన కోత విధించుకుంటుందా? లేక చిన్న పార్టీలు త్యాగం చేస్తాయా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. 
మరిన్ని వార్తలు