అయోధ్య రామమందిర నిర్మాణంపై స్పందించిన శివసేన

6 Jun, 2019 15:31 IST|Sakshi

ముంబై : ఈ సారి కూడా రామ మందిర నిర్మాణం పూర్తి చేయకపోతే.. జనాలు చెప్పు తీసుకుని కొడతారని అంటున్నారు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌. శివసేన పార్టీకి చెందిన 18 మంది ఎంపీలతో కలసి ఉద్దవ్‌ థాకరే ఈనెల 15న అయోధ్యను సందర్శించనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని జనాలకు హామీ ఇచ్చాం. చూస్తుండగానే 2019 ఎన్నికలు వచ్చాయి. కానీ ఇంతవరకూ రామ మందిర నిర్మాణం పూర్తి కాలేదు. ఈ అయితే నేటికి కూడా మా పార్టీ రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉంద’ని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాక ‘త్వరలోనే మందిర నిర్మాణం ప్రారంభించాలి. లేదంటే ఈ దేశ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన వారమవుతాం. ఇక జనాలు మమ్మల్ని ఎన్నటికి నమ్మరు. ఈ సారి కూడా మందిర నిర్మాణం పూర్తి చేయకపోతే.. జనాలు మా మీద చెప్పులు విసురుతారు’ అని పేర్కొన్నారు. ‘ఈ సారి ఎన్డీఏ కూటమి 350 స్థానాల్లో గెలుపొం‍దింది. బీజేపీ తరఫున 303 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఆలయ నిర్మాణానికి ఇంతకంటే మంచి తరుణం ఇకేం ఉంటుంద’ని ఆయన ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు