‘ముంబయి కొత్త మేయర్‌ ఈయనే’

8 Mar, 2017 16:24 IST|Sakshi
‘ముంబయి కొత్త మేయర్‌ ఈయనే’

ముంబయి: ఆసియాలోని అత్యంత ధనికవంతమైన నగర పాలక సంస్థ బృహణ్‌ముంబయికి కొత్త మేయర్‌ వచ్చేశాడు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో​ విజయబావుటా ఎగురవేసిన శివసేన పార్టీ తన మేయర్‌ అభ్యర్థిగా విశ్వనాథ్‌ మహదేశ్వర్‌ను ప్రకటించింది. దీనికి బీజేపీ కూడా చేతులెత్తి మద్దతు తెలపడంతో ఇక ఆయన కొత్త మేయరగా అవతరించారు. దీంతో మరోసారి బీజేపీ, శివసేనల మధ్య స్నేహం చిగురించినట్లయింది. ముంబయి నగర పాలక సంస్థకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో శివసేన ముంబయిలో విజయం సాధించినప్పటికీ దాదాపు దానికి దగ్గరగా బీజేపీ కూడా సీట్లు గెలుచుకుంది. అయితే, మేయర్‌ స్ధానం కోసం పోటాపోటీ పరిస్థితి ఉంటుందని, ప్రభావాలకు గురిచేసి బీజేపీ తన వైపు మద్దతుదారులను పెంచుకునే అవకాశం ఉందని భావించినా అలాంటిదేం జరగలేదు. తన పార్టీ తరుపున మేయర్‌ అభ్యర్థిని నిలపడంలేదని, తాము శివసేనకు మద్దతిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం శివసేన మేయర్‌ అభ్యర్థి విశ్వనాథ్‌కు మద్దతిచ్చారు. దీంతో ఆయన కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు