లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై సీఎం ఫైర్‌

2 Apr, 2020 18:39 IST|Sakshi

భోపాల్‌ : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ పలువురు రోడ్లమీదకు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను కోరింది. ఇక ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారిని నిరోధించేందుకు 21 రోజుల లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేశారు.

‘ఇది కేవలం ఓ ట్వీట్‌ కాదు..గట్టి హెచ్చరిక..మానవ హక్కులు కేవలం మానవులకే ఉంటా’యని ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నా అక్కడక్కడా జనం నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు స్ధానికులకు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్య బృందాలపై ఇండోర్‌లో కొందరు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు నిబంధనలను అతిక్రమించే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి కోరారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు.

చదవండి : పౌరులకు వీడియో సందేశం ఇవ్వనున్న మోదీ

మరిన్ని వార్తలు