ఆదాయ మార్గాలనూ చెప్పాలి

6 Jan, 2017 02:39 IST|Sakshi
ఆదాయ మార్గాలనూ చెప్పాలి

ఎన్నికల్లో అభ్యర్థులకు తప్పనిసరి చేయాలన్న ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్ర క్రియ మరింత పారదర్శ కంగా ఉండేలా అభ్య ర్థుల ఆదాయ వివరా లతో పాటు ఆదాయ మార్గాలను కూడా వెల్లడించడం తప్పనిసరి చేయాలని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. అలాగే... అభ్యర్థులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకెవరికైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఆర్థిక ఒప్పందాలున్నా అలాంటి నామినేషన్ ను రద్దు చేయాలంది. ఈ దిశగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని అభ్యర్థించింది. ఆరోగ్యకర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తప్పనిసరని, ఓటర్లకు అభ్యర్థుల ఆదాయ వివరాలు తెలియాలని ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అభిప్రాయపడింది. ప్రస్తుత మున్న నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి తనతోపాటు జీవిత భాగస్వామి, తనపై ఆధారపడినవారి ఆస్తులు, అప్పుల వివ రాలు మాత్రం నామి నేషన్  పత్రాల్లో పేర్కొంటే సరిపోతుంది.

అయితే ఈ విధానం వల్ల ఆదాయ మార్గాల వివరా లు తెలియవని, గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌తో పోల్చి చూసినప్పుడు ప్రస్తు తమున్న ఆదాయం సహేతుకంగా ఉందా లేదా అన్నది గుర్తించలేమంది. అభ్యర్థులు తమ ఆదాయ మార్గాల వివరాలు వెల్లడిం చేలా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయాలంటూ స్వచ్ఛంద సేవా సంస్థ లోక్‌ ప్రహరి అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. ఈ క్రమంలో ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్నికల్లో ధన బలాన్ని నియంత్రించి, సరైన అభ్యర్థి పోటీ పడేందుకు ఇవి దోహదపడతాయని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు