బుఖారీ హంతకుల్లో పాకిస్తానీ..!

27 Jun, 2018 20:14 IST|Sakshi
‘రైజింగ్‌ కశ్మీర్‌’ పత్రికాధిపతి షుజాత్‌ బుఖారీ. బైక్‌పై పారిపోతున్న నిందితులు

శ్రీనగర్‌: కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం కృషి చేసిన ‘రైజింగ్‌ కశ్మీర్‌’ పత్రికాధిపతి, సీనియర్‌ జర్నలిస్టు షుజాత్‌ బుఖారీని కాల్చిచంపిన కేసులో కీలక మలుపు. బుఖారీపై కాల్పులు జరిపిన దుండగులను గుర్తించినట్లు పోలీసు వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుల్లో ఒకరు పాకిస్తాన్‌కు జావేద్‌ జట్‌గా గుర్తించామని డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక దరాప్తు బృందం తెలిపింది. జావేద్‌ను ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో సభ్యుడిగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులని గుర్తించామని దర్యాప్తు బృందం పేర్కొంది. కాగా, జావేద్‌ గతంలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని బృందం తెలిపింది.

మరోవైపు గతంలో బుఖారిపై బ్లాగులో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్తానీని కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్‌ 14న ఇఫ్తార్‌ విందులో పాల్గొనడానికి కారులో వెళ్తున్న బుఖారీపై బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. ఘటనలో బుఖారీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 15 ఏళ్లపాటు హిందూ పత్రికలో పనిచేసిన బుఖారీ, తర్వాత రైజింగ్‌ కశ్మీర్‌ పత్రికను నెలకొల్పారు. 

మరిన్ని వార్తలు