పైలట్‌ కోసం సిక్కుల ఔదార్యం

8 May, 2020 13:41 IST|Sakshi

చంఢీఘడ్‌ : మత విశ్వాసాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటారు పంజాబ్‌లోని హోషియాపుర్‌ గ్రామవాసులు. సిక్కులు సంప్రదాయంగా ధరించే తలపాగా(టర్బన్‌) తీసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన ఎంఐజీ–29 యుద్ధ విమానం శుక్రవారం పంజాబ్‌లో కూలిపోయింది.(పంజాబ్‌లో కూలిన యుద్ధ విమానం)విమానం కూలిపోక ముందే పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటకు దూకేశారు.

అయితే అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటూ, గాయాలతో పైలట్‌ తీవ్ర ఒత్తిడికి గురి అయ్యారు. దీంతో అక్కడే ఉన్న కొందరు సిక్కులు తమ తలపాగాలు తీసి ఎండకు రక్షణగా గొడుగులా పైలట్‌కు పట్టారు. మిగతా సిక్కులు వాటిని ఊపుతూ గాలి వచ్చేలా చేశారు. అనంతరం వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్‌ అక్కడికి చేరుకోవడంతో, దాంట్లో పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్‌ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కష్టాల్లో ఉన్న యుద్ధ విమాన పైలట్‌ కోసం సిక్కులు చూపించిన తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు