ఆ టీచర్‌ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా..

22 Nov, 2019 16:51 IST|Sakshi

గాంగ్‌టక్‌ : బాలల దినోత్సవం నాడు తమ పాఠశాల చిన్నారులను ఉత్తేజపరిచేందుకు సిక్కిం స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ చేసిన డ్యాన్స్‌ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటించి 2015లో విడుదలైన బాజీరావు మస్తానిలోని హిట్‌ సాంగ్‌ మల్‌హారికి స్కూల్‌కు చెందిన సాంస్కృతిక అంశాలు బోధించే టీచర్‌ షెరింగ్‌ దొమ భూటియా చేసిన నృత్యం విద్యార్ధులతో పాటు తోటి టీచర్లు, పాఠశాల సిబ్బందినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటకు ఆమె హుషారుగా వేసిన స్టెప్స్‌ రణ్‌వీర్‌సింగ్‌ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఆమె చూపిన జోరు వీక్షకులను కట్టిపడేసింది. రణ్‌వీర్‌ స్టెప్పులను సరిపోలినట్టుగా ఆమె నృత్యరీతులు ఆకట్టుకున్నాయి. మెల్లి గవర్న్‌మెంట్‌ సెకండరీ స్కూల్‌లో షెరింగ్‌ ఇచ్చిన డ్యాన్స్‌ ఫెరఫామెన్స్‌ వీడియోను స్కూల్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు