'ముద్దు' వివాదం : జడ్జిగా తప్పుకుంటున్నా

24 Feb, 2018 17:37 IST|Sakshi
సింగర్‌ పాపోన్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్న వివాదంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ సింగర్‌ కమ్‌ కంపోజర్‌ పాపోన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం సద్దుమణిగే వరకు వాయిస్‌ ఇండియా ప్రొగ్రామ్‌ న్యాయ నిర్ణేతగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మ్యూజిక్‌ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్న పాపోన్‌, హోలీ ప్రత్యేక ఎపిసోడ్‌ చిత్రీకరణ సందర్భంగా ఓ మైనర్‌ బాలికకు రంగు పూసి పెదాలపై ముద్దు పెట్టారు. ఆ వ్యవహారమంతా ఫేస్‌ బుక్‌ లైవ్‌లో టెలీకాస్ట్‌ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తనపై తప్పుడిగా వస్తున్న ఆరోపణలు పూర్తిగా సద్దుమణిగే వరకు న్యాయ నిర్ణేతగా తాను వ్యవహరించనని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందన్నారు. ఈ షోకి షాన్‌, హిమేష్‌ రేష్మియాలు కూడా జడ్జిలుగా ఉన్నారు. ఈ వివాదంపై మైనర్‌ బాలిక, ఆమె తండ్రి స్పందించారు. పాపోన్‌ తప్పుడు ఉద్దేశ్యంతో ఏమీ చేయలేదని, పాపోన్‌ తన కూతురికి తండ్రి లాంటి వారని మైనర్‌ బాలిక తండ్రి చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ బాలిక కూడా చెప్పింది. సొంత కూతురిలాగానే తనని ముద్దుపెట్టుకున్నాడని తెలిపింది. తన అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రేమతో ముద్దు చేశారని పేర్కొంది. దీనిలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది.  అయితే పాపోన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అస్సాం బాలల హక్కుల సంఘం ఈయనపై కేసు నమోదుచేసింది. 

మరిన్ని వార్తలు