వాళ్లు సమాజానికి ప్రమాదకరం

11 Aug, 2018 13:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: సింగిల్‌ పేరెంటింగ్‌ సమాజానికి అంత శ్రేయస్కారం కాదని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌ కిరుబకరన్‌ అభిప్రాయపడ్డారు. పిల్లలకు తల్లి,తండ్రి ఇద్దరి ఆప్యాయత కావాలని, కానీ సింగిల్‌ పేరెంటింగ్‌తో వారు ఒకరి ఆప్యాయతకు దూరమవుతున్నారని తెలిపారు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 16,2015న పిల్లలపై అఘాత్యాలకు పాల్పడే నిందితులను పోక్సో చట్టం కింద శిక్షించాలని కోర్టు ఇచ్చిన తీర్పును మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదని గిరిజా రాఘవన్‌ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరగడానికి మహిళా, శిశు సంక్షేమశాఖల విభజన జరగక పోవడమే కారణమన్నారు. ఈ శాఖను మహిళా అభివృద్ధి, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలుగా విభజించేలా కేంద్రప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు సూచించారు. ఇక పిల్లలపై జరిగే అఘాత్యాలన్నీ పోక్సో చట్టం కిందకు వస్తాయని తెలిసేలా అన్ని రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్భయ నిధులను రాష్ట్రాలకు కేటాయించడంపై ఓ గైడ్‌లైన్‌ కూడా రూపోందించాలన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా