అతడిపై కఠిన చర్యలు తీసుకోండి: నిర్మల

24 Jun, 2020 11:41 IST|Sakshi

న్యూఢిల్లీ : గుజరాత్‌లో మహిళా బ్యాంక్ ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధి​కారులను ఆదేశించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కాగా సూరత్‌లోని కెనరా బ్యాంక్‌(ఒకప్పటి సిండికేట్‌ బ్యాంక్‌) మహిళా ఉద్యోగినిపై సోమవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్‌ దాడి చేయడమే కాకుండా బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన అనంతరం ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల నుంచి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి, కేసు విచారణణు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. (కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం)

ఈ మేరకు ట్వీట్‌ చేసిన ఆమె ‘బ్యాంకు ఉద్యోగుల భద్రత  ప్రాముఖ్యత. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ​బ్యాంకుకు చెందిన మహిళ సిబ్బంది దాడి  ఘటనపై డాక్టర్‌ ధవాల్‌ పటేల్‌, సూరత్‌ జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ భ్రాంభట్‌తో మాట్లాడాను. మహిళా బ్యాంక్‌ ఉద్యోగి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈ కేసుపై సకాలంలో చర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అలాగే నిందితుడు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్‌ చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ భ్రాంభట్ పేర్కొన్నారు’ అని నిర్మలా తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. (అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌! )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు