షాపును ధ్వంసం చేసిన సేన సైనికులు

27 May, 2020 19:15 IST|Sakshi

ముంబాయి: శివసేన కార్యకర్తలు బుధవారం మహారాష్ట్రలోని యవత్మల్‌ జిల్లాలోని ఒక ఎలక్ట్రిక్ షాపులో విధ్వంసం సృష్టించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేను, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఛీఫ్‌ శరద్‌ పవార్‌ను, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని విమర్శించినందుకు శివసేన కార్యకర్తలు షాపును నాశనం చేశారు. సోమవారం సోషల్‌మీడియాలో శివసేనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడంతో శివసేన సైనికులు షాపు యజమానిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో ఆగకుండా బుధవారం అతని షాపును నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొంత మంది పోలీసులు సమక్షంలోనే షాపులోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను నాశనం చేశారు. (కేరళనుసూపర్ స్ప్రెడర్గా మారుస్తారా?)

బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నారాయణ్‌ రాణే సోమవారం గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి  కరోనాని కట్టడి చేసే సామర్థ్యం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాహుల్‌ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పోటీలో లేదని చెప్పడంతో ప్రభుత్వ వైఫల్యల నుంచి కాంగ్రెస్‌ తప్పించుకొని నింద మొత్తం శివసేన మీద వేయడానికి చూస్తోందని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణల క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కెయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా కూడా ఈ యుద్దం ముదిరి అభిమానులు మహావికాస్‌అఘాడిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్‌ చేశారు. దీంతో శివసేన సైనికులు సదరు వ్యక్తి షాపును ధ్వంసం చేశారు. 
(లాక్డౌన్ 5.0 : నగరాలపై ఫోకస్)

మరిన్ని వార్తలు