కంటైన్‌మెంట్ జోన్‌గా రాజ్‌భ‌వ‌న్‌..ఆరుగురికి క‌రోనా

28 May, 2020 12:39 IST|Sakshi

భోపాల్ : రాజ్‌భ‌వ‌న్‌లో ఒకేసారి ఆరుగురికి క‌రోనా సోక‌డం అధికార వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ్‌భ‌వ‌న్ క్వార్ట‌ర్స్‌లో నివాస‌ముంటున్న ఆరుగురికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ కావ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన యంత్రాంగం  రాజ్‌భ‌వ‌న్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి కలెక్టర్ తరుణ్ పిథోడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం  రాజ్‌భ‌వ‌న్ క్వార్ట‌ర్స్‌లో నివాసం ఉంటున్న  క్లీన‌ర్‌ కుమారుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కోవిడ్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. (నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది: జితేంద్ర అవద్‌ )

తాజాగా మ‌రో రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగికి కూడా క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో రాజ్‌భ‌వ‌న్‌లో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ఆరుకి చేరడంతో అధికార వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. కేసులు పెరుగుతుండ‌టంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించ‌డంతో పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజేష‌న్ నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాడోన్‌కు క‌రోనా టెస్ట్ చేయించ‌గా నెగిటివ్ రావ‌డంతో అధికార వ‌ర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అంతేకాకుండా రాజ్‌భ‌వ‌న్‌లో నివాస‌ముంటున్న అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ప్ర‌స్తుతం కొత్త‌గా క‌రోనా కేసులు లేవ‌ని రాజ్‌భ‌వ‌న్ అధిక‌ర ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటిస్తూ అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. (భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు