పాట్నా బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురి నిర్బంధం

9 Nov, 2013 16:37 IST|Sakshi

బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి వందలాది బ్యాంక్ పాస్బుక్లు, ఏటీఎమ్ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు శనివారం పోలీసులు వెల్లడించారు. నిఘా విభాగాల సమాచారం మేరకు శుక్రవారం రాత్రి లఖిసరాయ్లో రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు.

'ఎన్ఐఏ అధికారులు ఆరుగురి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 300 పాస్బుక్లు, 30 ఏటీఎమ్ కార్డులు, నగదు లావాదేవీలకు సంబంధించి ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితులకు దేశం వెలుపల ఉన్న ఉగ్రవాదులతో సంబంధం ఉండొచ్చని ఎన్ఐఏ భావిస్తున్నట్టు వెల్లడించారు. మరింత సమాచారం కోసం వారిని విచారిస్తున్నట్టు చెప్పారు. గత మూడు రోజులుగా ఎన్ఐఏ బీహార్లోని పలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. గత నెలలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్న పాట్నా ర్యాలీ సందర్భంగా ఉగ్రవాదులు వరుస బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు