మంచుచరియలు పడి ఆరుగురు జవాన్ల మృతి

21 Feb, 2019 02:38 IST|Sakshi
గల్లంతైన జవాన్ల కోసం అన్వేషిస్తున్న సైనికులు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘటన 

సిమ్లా: మంచుచరియలు విరిగిపడి ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హిమాచల్‌కు చెందిన జవాను రాకేశ్‌ కుమార్‌(41) మృతదేహాన్ని మాత్రం మంచు దిబ్బల కింద సహాయకదళాలు గుర్తించారు. మిగతా జవాన్ల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. కినౌర్‌ జిల్లాలో భారత్‌–చైనా సరిహద్దులోని షిప్కీలా బోర్డర్‌ పోస్ట్‌ వద్ద నీటపారుదల వ్యవస్థ రిపేర్‌ కోసం 16 మంది జవాన్ల బృందం అక్కడికి వెళ్లింది. అదే సమయంలో హిమపాతం సంభవించింది.

ఈ ఘటనలో ఐదుగురు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ జవాన్లు సైతం గాయపడ్డారు. చాలామంది జవాన్లు మంచులో కూరుకుపోయినా అందరినీ రక్షించామని కినౌర్‌ డెప్యూటీ కమిషనర్‌ గోపాల్‌ చంద్‌ చెప్పారు. దాదాపు 150 మంది జవాన్ల బృందం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది.

మరిన్ని వార్తలు