చల్లని కబురు; జూన్‌ 4న కేరళకు రుతుపవనాలు

14 May, 2019 17:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. జూన్‌ 4న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని జూన్‌ 29 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుతాయని ప్రైవేట్‌ వాతావరణ కేంద్రం స్కైమెట్‌ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ పేర్కొంది.

అండమాన్‌ నికోబార్‌ దీవుల మీదుగా రుతపవనాలు ఈనెల 22న ప్రవేశించి కేరళ దిశగా కదులుతాయని వాటి పురోగమనం మందకొడిగా ఉండటంతో ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని, తూర్పు, ఈశాన్య, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుం‍దని అంచనా వేసింది. జూన్‌ 4కు అటూ ఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు