చెత్త రూల్స్‌: బాలిక డ్రెస్సు కత్తిరించిన టీచర్‌

2 Jun, 2018 14:50 IST|Sakshi

రాయ్‌పూర్‌ : పరీక్షలలో కాపీ జరగకుండా ఉండేందుకు పెట్టే నిబంధనలు రోజురోజుకు హద్దు మిరుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్‌లో గురువారం ఛత్తీస్‌ఘడ్‌ ప్రీ అగ్రికల్చర్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలిక పొడువాటి డ్రెస్‌ చేతులను(స్లివ్స్‌) పరీక్షను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడే కత్తెరతో కత్తిరించడం వివాదస్పదమైంది. పరీక్షల పేరుతో ఇలాంటి చెత్త చెత్త నిబంధనలను పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై స్పందించిన ఆ జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి సదరు ఉపాధ్యయుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా గతంలో మన రాష్ట్రంలో జరిగిన చాలా ప్రవేశ పరీక్షలకు ఇలాంటి అసంబంధమైన నిబంధనలు పెట్టి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బంగారు ఆభరణాలను తొలగించుట, లో దుస్తులను తీయించుట లాంటి సంఘటనలు తీవ్ర దుమారాన్నే లేపాయి. 

మరిన్ని వార్తలు