క్యాష్‌లెస్‌ కష్టాలు

14 Apr, 2017 01:21 IST|Sakshi
క్యాష్‌లెస్‌ కష్టాలు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఐదు నెలలు దాటినా నగదు కొరత కష్టాలు తీరలేదు. అదీగాక గత రెండు నెలలుగా నగదు కొరత మరింత ఎక్కువైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ‘గత రెండు నెలలుగా పరిస్థితి మరింత దిగజారింది. గత వారంలో హైదరాబాద్‌లోని ఏటీఎంల చుట్టూ తిరిగిన 83 శాతం మంది నోటు కళ్లజూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

మహారాష్ట్రలోని పుణేలో కూడా 69 శాతం మందిది ఇదే పరిస్థితి’ అని లోకల్‌ సర్కిల్స్‌ సిటిజెన్‌ ఎంగేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం జరిపిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో.. సుమారు 10 వేల మందిపై ఈ సంస్థ సర్వే జరిపింది. ఏటీఎంలతో హైదరాబాద్‌వాసులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. బ్యాంకులు 4 నగదు ఉపసంహరణల తర్వాత చార్జీలు విధిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బును డ్రా చేస్తున్నట్లు చాలా మంది తెలిపారు. ఇక ఢిల్లీలో 11% మంది ఇబ్బందులు ఎదుర్కొనట్లు సర్వేలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు