‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’కు మెరుగులు

28 Oct, 2014 00:20 IST|Sakshi

 న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పథకాన్ని మరింత ముందుకు తీసెకెళ్లడానికి ఎన్‌డీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల పద్ధతి-నీటి కనెక్షన్లను ఆధునికీకరించనుంది. ఇందుకోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేడియో ఫ్రీక్వెన్సీ అనుసంధానంతో ఎలక్ట్రిసిటీ మీటర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా మీటర్ రీడింగ్ ప్రతినెలా  ఆటోమెటిక్‌గా నవీనీకరించబడుతోంది. ఈ ప్రాజెక్టును మొదట కన్నాట్ ప్రాంతంలో ప్రారంభించాలని నిర్ణయించింది.
 
 ఆటోమెటిక్‌గా సమాచార సేకరణ: ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ మీటర్లకు రేడియో ఫ్రీక్వెన్సీని అనుసంధానం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పద్ధతి ద్వారా మీటర్ రీడింగ్ ఆటోమెటిక్‌గా మారుతోందని సీనియర్ అధికారి తెలిపారు. ‘ తమ సిబ్బంది చేతిలో పట్టుకొనే సదుపాయం ఉన్న పరికరంతో ఓ భవన సముదాయానికి వెళ్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంలో ఉన్న సమాచారం ఆటోమెటిక్‌గా సిబ్బంది చేతిలో ఉన్న పరికరంలోకి ఎలాంటి అవాంతరం లేకుండానే మారుతోందని తెలిపారు.
 
 బిల్లింగ్‌లో తీవ్ర జాప్యానికి చెక్: నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పుడు ఉన్న పద్ధతిలో  మీటర్ రీడింగ్‌ను పరిశీలించి, సమాచారం సేకరించి బిల్లింగ్ చేయడానికి ఎన్‌డీఎంసీ సిబ్బందికి సుమారు రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఇదే పద్ధతిలో నీటి బిల్లుల వసూళ్లలో కూడా జాప్యం జరుగుతోంది. నగర పాలక సంస్థకు నెలకు సుమారు 50 కోట్ల ఆదాయం  విద్యుత్ సరఫరా ద్వారానే వస్తోంది. సమయానికి బిల్లులు అందజేయక ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చే   సాంకేతిక పద్ధతిలో ఆదాయ లోటును తగ్గించడంతోపాటు వ్యవస్థను ఆధునికీకరించనుంది. త్వరలోనే  టెండర్లను ఆహ్వానించడానికి సంస్థ చర్యలు తీసుకొంటోంది.
 

>
మరిన్ని వార్తలు