ఇక స్మార్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు

15 Oct, 2018 01:34 IST|Sakshi

దేశమంతా ఒకే రకంగా ఉండేలా...

న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్‌ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్‌లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు.

ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్‌ కోడ్‌లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్‌ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్‌ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా