‘స్మార్ట్ గంగా సిటీ’ షురూ

14 Aug, 2016 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘స్మార్ట్ గంగా సిటీ’ కార్యక్రమాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు, ఉజ్జయిని నుంచి జల వనరుల మంత్రి ఉమాభారతి ప్రారంభించారు. గంగానదీ పరీవాహక ప్రాంతాల్లోని పది నగరాలలో ఈ కార్యక్రమాన్ని తొలి విడతలో ప్రారంభించారు. మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలుచేయనున్నారు.

తొలి విడతకు హరిద్వార్, రిషికేష్, మథుర, వారణాసి, కాన్పూర్, అలహాబాద్, లక్నో, పట్నా, షాహీబ్‌గంజ్, బారక్‌పూర్‌ను ఎంపిక చేశారు. ఈ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం 40 శాతం మూలధన నిధులు ఇవ్వనుంది. మిగతా 60 శాతం నిధులను 20 సంవత్సరాల్లో విడతల వారిగా ఇవ్వనున్నారు. గతంలో 70 శాతం మాత్రమే కేంద్రం భరించేదని ఇప్పుడు కేంద్రమే 100 శాతం నిధులను ఇస్తుందని ఉమ చెప్పారు.

మరిన్ని వార్తలు