పర్సనల్‌ కంటే పోర్న్‌ చాలా ముఖ్యం...

10 Apr, 2018 18:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు చాలా మట్టుకు స్టోరేజీ సమస్యతో సతమతమవుతున్నారంట. అలాంటి తరుణంలో ఏం చేయాలో తెలీక తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను ఫోన్‌ నుంచి తొలగించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు అశ్లీల డేటా జోలికి వెళ్లకపోవటం ఇక్కడ విశేషం. 

ప్రముఖ కంపెనీ సాన్‌డిస్క్‌ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మొత్తం లక్ష మందిపై ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 29 శాతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు వారానికొకసారి.. 62 శాతం మూడు నెలలకొకసారిగా తమ ఫోన్‌లోని మెమొరీని ఫ్రీ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తంలో 65 శాతం మంది మాత్రం అందుకోసం తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను తొలగించేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని తొలగించాక చాలా బాధపడుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. అయితే తమ ఫోన్‌లలోని పోర్న్‌.. అసభ్య ఫోటోలను జోలికి మాత్రం వాళ్లు వెళ్లట్లేదంట. వాటికి బదులు.. తమ వ్యక్తిగత సమాచారాన్నే త్యాగం చేసేందుకు మొక్కు చూపుతున్నారని సర్వేలో తేలింది. 

అయితే డేటాను తొలగించుకునే బదులు వాటిని స్టోర్‌ చేసుకునే మార్గాలు ఉన్నాయి కదా అని శాన్‌డిస్క్‌ డైరెక్టర్‌ ఖలీద్‌ వానీ వినియోగదారులకు సూచిస్తున్నారు. ‘ఆ సమయంలో కంగారుపడి మెమొరీని తొలగించేస్తున్నారే తప్ప.. వాటిని మరో డివైస్‌లోకి బదిలీ చేయాలన్న ఆలోచన వారికి తట‍్టడం లేదని’ ఆయన అంటున్నారు. ఇక సర్వేలో పాల్గొన్న వాళ్లలో 23-40 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా ఉండగా.. పోర్న్‌ ప్రస్తావన తెచ్చిన వాళ్లు 60 శాతం ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు