స్మృతి ఇరానీ ట్వీట్‌.. వైరలవుతోన్న ఫోటోలు

9 Jul, 2020 21:18 IST|Sakshi

లక్నో: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి అమేథి నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో అమేథిలోని గౌరిగంజ్‌ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. 2019కి ముందు.. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ రూపురేఖలు ఎలా మారాయో ఈ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన అమేథి గౌరిగంజ్‌ రైల్వే స్టేషన్‌ను నూతనంగా మార్చడానికి సాయం చేసిన పియూష్‌ గోయల్‌కు కృతజ్ఞతలు’ అంటూ స్మృతి ఇరానీ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలను అప్పుడు.. ఇప్పుడు పేరుతో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కృషి చేసినందుకు స్మృతి ఇరానీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నెటిజనులు. 
 

ఎన్నికల ప్రచారం నాటి నుంచే స్మృతి ఇరానీ అమేథిలో మౌలిక సదుపాయాల కొరత గురించి తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని పలుమార్లు సందర్శించారు. స్థానిక దేవాలయాలు, పర్యాటక  ప్రదేశాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాక రాజీవ్‌గాంధీ హాయాంలో రాయ్‌బరేలీ నుంచి అన్‌చహర్‌ వరకు తలపెట్టిన రైల్వే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లుందుకు కూడా స్మృతి ప్రయతిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అమేథిలో 12 వేల శానిటైజర్ల బాటిళ్లు, 20 వేల ఫేస్‌ మాస్క్‌లు, 10 వేల సబ్బులు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు