వైరల్‌: కత్తులతో కేంద్రమంత్రి నృత్యం

16 Nov, 2019 11:54 IST|Sakshi

గాంధీనగర్‌ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తులు చేత పట్టారు. అంతేకాదు కరవాలాలను అలవోకగా తిప్పుతూ డాన్స్‌ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్‌కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి నారాయణ గురుకుల్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు.. కేంద్రమంత్రి పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని నృత్యం చేశారు. ఈ నృత్యం పేరు 'తల్వార్ రాస్'. ఇది సాంప్రదాయ జానపద నృత్యం. గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రసిద్ది చెందిన నృత్యం ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని డాన్స్ చేయడం. విద్యార్థులతో పాటు స్మృతి ఇరానీ కూడా వారితో సమానంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 


 

మరిన్ని వార్తలు