‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’

16 Jun, 2020 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిత్యం సామాజిక సమస్యలపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాలన తెలుపుతూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ.. ప్రేరణ కలిగించే సందేశాలను నిత్యం షేర్‌ చేస్తూంటారు. తాజా బాలీవుడ్‌ యంగ్‌  హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆమె స్పందిస్తూ.. జీవితానికి సంబంధించిన కొన్ని స్పూర్తిదాయకమైన కోట్స్‌ను మం‍గళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..)

అవి.. ‘‘మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ఎప్పటికీ మరవొద్దు.. అలాగే మీరు చేరుకునే గమ్యం వచ్చే వరకు మీ కళ్లను తీప్పుకోవద్దూ’’, ‘‘ఎవరైతే ఒంటరిగా పోరాడుతారో.. వారు మరింత బలవంతులు అవుతారు’’ అలాగే ‘‘మీ ఆశలను,  కలను నెరవేర్చుకునే క్రమంలో ఇతరులు ద్వేషించడం మొదలు పెడుతారు.. ఎందుకంటే అక్కడ వారు ఉండరు’ చివరిగా ‘‘మీరు కష్టపడి ఎదుగుతున్న క్రమంలో మీరు ఎవరీకి స్పూర్తినిస్తారో మీకు తెలియదు.. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు పట్టుదలతో ముందుకు సాగాలి’’ అంటూ షేర్‌ చేశారు. కాగా సుశాంత్‌ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో తెలిపారు.

మరిన్ని వార్తలు