పోలీసుల‌కు సోకిన క‌రోనా.. అత్య‌ధికంగా ఆ రాష్ర్టంలోనే

18 May, 2020 16:31 IST|Sakshi

ముంబై : దేశవ్యాప్తంగా నమోద‌వుతున్న క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లోనే వెలుగుచూస్తున్నాయి. పోలీసు శాఖ‌లోనూ క‌రోనా కేసులు అమాంతం పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంది. గ‌త 24 గంట్లోనే మ‌హారాష్ర్ట‌లో 67 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్ప‌టివర‌కు రాష్ర్ట వ్యాప్తంగా క‌రోనా సోకిన పోలీసుల సంఖ్య 1,273కు చేరుకుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.ఈ మొత్తం కేసుల్లో 131 ఐపీఎస్ స్థాయి అధికారులుండ‌గా, 1142 మంది ఇత‌ర పోలీసు సిబ్బంది ఉన్నారు. వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది పోలీసులు మృత్యువాత ప‌డ్డారు.

మ‌హారాష్ర్ట వ్యాప్తంగా 33,053 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో పోలీసుల బ‌ల‌గాల‌ను పెంచ‌డానికి అద‌నంగా 20 ఆర్మీ బ‌ల‌గాల‌ను మోహ‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ‌ను కోరింది. దీనికి సంబంధించి అద‌న‌పు బ‌ల‌గాల‌ను విస్త‌రించారు. ఇక క్వారంటైన్ సెంట‌ర్లు, రెడ్ జోన్లలో ప‌నిచేసే పోలీసు సిబ్బంది ఎక్కువ‌గా క‌రోనా భారిన ప‌డ‌తున్న‌ట్లు తేలింది. (ఎమ్మెల్సీగా ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం )


 

మరిన్ని వార్తలు