పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!

3 Jun, 2020 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి సమయంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం సామాజిక దూరం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే సామాజిక దూరం పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ మనం దాని ప్రాధాన్యతను గుర్తించలేక పోతున్నాం. భారత్‌లో లాక్‌డౌన్‌ పరిమితులు సడలించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా సామాజిక దూరం ఉల్లంఘిస్తున్న సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలాంటి ప్రదేశాలలో మరింత ఎక్కువగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో గతంలో కంటే వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ నిబంధనలను పాటించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ 1 నుంచి ఈ పరిస్థితి దారుణంగా తయారైంది. చదవండి: భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు

కోల్‌కతాలో కేవలం 20మంది ప్రయాణికులతో బస్సు ప్రయాణాలకు అనుమతించగా సీటింగ్‌ సామర్థ్యానికి మించి ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం మెజారిటీ కార్యకలాపాలకు అనుమతించినప్పటికీ.. కరోనా మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసం సామాజికి దూరం నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. గత కొన్ని రోజులుగా భారత్‌లో రోజూవారీ కేసులు దాదాపుగా 8 వేలుగా నమోదవుతున్న తరుణంలో.. సామాజిక దూరం ఉల్లంఘన పెను ముప్పుగా మారనుంది. చదవండి: అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు 

మరిన్ని వార్తలు