‘సామాజిక' న్యాయం

1 Mar, 2015 02:09 IST|Sakshi

న్యూఢిల్లీ: సామాజిక న్యాయం, సాధికారత శాఖకు ఈ బడ్జెట్లో రూ. 7 వేల కోట్లకు పైగా కేటాయింపులు జరిపారు. సామాజిక న్యాయం, సాధికారత విభాగానికి రూ. 6,524.82 కోట్లు, అంగవైకల్య వ్యవహారాల విభాగానికి రూ. 636.94 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీజసీల సామాజిక భద్రత, సంక్షేమానికి రూ. 2100 కోట్లను, పాకీపనివారిని ఆ పని నుంచి విముక్తి కలిగించి, స్వయం ఉపాధికి సహకరించే పథకానికి రూ. 460 కోట్లను కేటాయించారు.

అంగవైకల్యం ఉన్నవారి సంక్షేమం కోసం రూ. 527.93 కోట్లను కేటాయించారు. ఇది గత సంవత్సర బడ్జెట్ కన్నా దాదాపు రూ. 160 కోట్లు అధికం. మరోవైపు, మహిళ, శిశు అభివృద్ధికి  శాఖకు రూ. 10351 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. పన్ను ఆదాయం అనుకున్నంతగా సమకూరితే.. బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులకు అదనంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి(ఐసీడీఎస్) రూ. 1500 కోట్లు, సమగ్ర శిశు రక్షణ పథకానికి(ఐసీపీఎస్) రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు.

మరిన్ని వార్తలు