ట్యాంకు ఫుల్‌ చేయించండి..!

31 May, 2018 09:04 IST|Sakshi

‘పెట్రో’ ధరల తగ్గింపుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు బుధవారం చమురు సంస్థలు ప్రకటించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ‘పైసా’చికంపై సోషల్‌ మీడియాలో జోకులు, వంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఫొటోలు, వీడియోలతో ప్రభుత్వ చమురు సంస్థల తీరును ఎండగట్టారు.

  • ఒక్క పైసాను ఏం చేసుకోవాలబ్బా... ఆ...గుర్తొచ్చింది.  జన్‌ధన్‌ యోజన అకౌంట్లలో జమచేసేస్తాను.
  • అసలు దీనంతటికీ కారణం మన తొలి ప్రధాని నెహ్రూయే. ఆయన హయాంలోనే పైసాను చలామణిలోకి తెచ్చారు. అందుకే ఇప్పుడు పైసా తగ్గింది
  • ఒక్క పైసా ఆదా అయింది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమేం కొనాలో ఒక జాబితా రూపొందించుకోవాలి.
  • అబ్బా! ఎంత ఉపశమనమో. ఒక్క పైసా తగ్గిందోచ్‌.. నిజంగా ఇవాళ నేను కోటీశ్వరుడినన్న భావన కలుగుతోంది.
  • సేల్‌ సేల్‌.. మెగా సేల్‌.. పెట్రోల్‌పై ఒక్క పైసా డిస్కౌంట్‌. త్వరపడండి.. ట్యాంకు ఫుల్‌ చేయించండి.. మంచి తరుణం మించినా దొరకదు.
  • అబ్బో.. ఊహించలేకపోతున్నాం. ఏకంగా ఒక్క పైసా తగ్గించారు కదా.. ప్రజలపై మోదీకి ఉన్న సానుభూతిని వెలకట్టలేం... నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది.
  • పట్టలేనంత సంతోషంగా ఉంది. నా అందమైన భవిష్యత్‌ని నిర్మించుకోవడానికి ఒక్క పైసా ఆదా చేసుకోగలిగాను. ఇంతకంటే జీవితానికి కావల్సినదేముంది.
  • పెట్రోల్‌, డీజిల్‌పై ఆదా చేసిన ఒక్క పైసాతో ఇల్లు, కారు, హెలికాప్టర్‌ కొనాలనుకుంటున్నాను.
Poll
Loading...
మరిన్ని వార్తలు