ప్రమాదంలో భూమి?!

11 Nov, 2017 08:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సౌర మండంలో సంభవిస్తున్న సౌర తుఫానులు భూమికి అత్యంత ప్రమాదకరంగా పరణమిస్తున్నాయి. ఈ  మధ్య కాలంలో నక్షత్ర మండలం వైపు ప్రయాణించే సౌర తుఫానులు తమ గమనం మార్చుకుని భూమివైపు ప్రమాణిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సౌర తుఫానులు భూ కక్షలోకి ప్రవేశించాయి. ఈ సౌర తుఫానుల వల్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థ సర్వనాశనం దెబ్బతినే ప్రమాదముంది. సౌర తుఫానుల వల్ల శాటిలైట్లు మాడిమసి అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మన సౌర వ్యవస్థకు ఆవల నిబురు అనే ఊహాత్మక సౌర వ్యవస్థ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌర వ్యవస్థకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

భూమిమీదకు వేగంగా..!
మన సౌర వ్యవస్థకు మిలియన్‌ మైళ్ల దూరంలో ఉన్న నిబురునుంచి ప్లానెట్‌ - X అనే ఉపగ్రహం భూమిని ఢీ కొట్టేందుకు అత్యంత వేగంగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లానెట్‌ - X నిజంగానే భూమిని ఢీ కొడితే.. ఇక్కడ జీవరాశి మనుగడే ప్రమాదంలో పడుతుంది.

2012 నుంచే..!
నిబురు గ్రహం, ప్లానెట్‌ - X గురించి 2012 నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో భూమి మీద అనేక భీకర ప్రమాదాలు సంభవించాయి. అంతరిక్షంలోనూ ఊహించడానికి భమపడేంత స్థాయిలో విపరీతాలు జరిగాయి. తాజాగా సౌర తుఫానులు మన సమాచార వ్యవస్థలనే నాశనం చేసేలా వస్తున్నాయి. ఇవే అత్యంత ప్రమాదరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు