సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ రాజీనామా

21 Oct, 2017 03:58 IST|Sakshi

న్యూఢిల్లీ: సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రంజిత్‌ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కార్యాలయానికి పంపారు.

2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్‌ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. కేంద్రంలో అత్యంత కీలక న్యాయ పదవిలో ఉంటూ రాజీనామా చేసిన వారిలో రంజిత్‌  రెండోవారు. 

మరిన్ని వార్తలు