సత్య నాదెళ్ల.. ఆసక్తికర నిజాలు

19 Aug, 2016 10:37 IST|Sakshi
సత్య నాదెళ్ల.. ఆసక్తికర నిజాలు

సత్య నాదెళ్ల.. ఈ పేరు వింటనే ఒక రకమైన వైబ్రేషన్.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో వరకు వెళ్లిన ఆయన ప్రస్థానం గురించి ప్రస్తావించడం నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా పనిచేస్తున్న తొలి అమెరికాయేతరుడిగా గుర్తింపు పొందిన నాదెళ్ల నేడు(ఆగస్టు 19)న 49 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలను ఒకసారి స్పృషిస్తే..

  • సత్యనాదెళ్ల ఆగస్టు 19, 1967లో హైదరాబాద్ లో జన్మించారు.
  • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థిగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోసం మనిపాల్ యూనివర్సిటీలో చేరారు.
  • గ్రాడ్యుయేషన్ పూర్తవగానే 1988లో అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
  • చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందారు.
  • తన బాల్య స్నేహితురాలు.. స్కూల్ మేట్ అనుపమను వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది (1992)లోనే మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరారు. అంతకుముందు సన్ మైక్రో సిస్టం(ప్రస్తుతం ఇది ఒరాకిల్ కార్పొరేషన్ ది)లో పనిచేశారు.
  • మైక్రోసాఫ్ట్ లో బింగ్ విభాగానికి చాలాకాలం సేవలు అందించారు. సరిగా గుర్తింపే లేని ఈ బ్రౌజర్ కు నాదెళ్ల ఆధ్వర్యంలోనే జనాల్లోకి దూసుకెళ్లింది.
  • డేటాబేస్, విండోస్ సర్వర్, డెవలపర్ టూల్స్, క్లౌడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ తీసుకురావడంలో నాదెళ్లదే కీలక భూమిక. ఇక క్లౌడ్ వర్షన్ ఆఫీస్ 365 తీసుకొచ్చింది కూడా నాదెళ్లనే. అత్యంత వేగంగా పనిచేసే ప్రొడక్ట్.
  • తనకి మార్గదర్శకుడు బిల్ గేట్స్ అనే నాదెళ్ల సత్యం చెప్తుంటారు.
  • మిగితా భారతీయుల్లాగే నాదెళ్లకు క్రికెట్ అంటే పిచ్చి. కవితలను బాగా ఎంజాయ్ చేస్తారు.
  • ప్రస్తుతం ఆయన తాను రాస్తున్న పుస్తకం 'హిట్ రిఫ్రెష్' పై పనిచేస్తున్నారు. ఈ పుస్తకంలో మూడు విభాగాలు ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు