సోమ్‌నాథ్‌ అంత్యక్రియలు అందుకే చేయడం లేదు

13 Aug, 2018 16:24 IST|Sakshi

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) మృతితో అయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల చటర్జీకీ అధికార లాంఛానాలతో వీడ్కోలు పలకాలని బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కమ్యూనిజం భావజలం గల ఈ సీనియర్‌ నేత.. తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్‌ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే కోరారు. దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్‌ఎస్‌కేఎమ్‌ హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

మెడికల్‌ కాలేజీకి తరలించే ముందు లీగల్‌ లాయర్‌ అయిన ఈ కమ్యూనిస్టు నేతకు కోల్‌కతా హైకోర్టుతో ఎంతో అనుబంధం ఉంది.. దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి కోల్‌కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.. పోలీసుల వందన అనంతరం మెడికల్‌ కాలేజీకి తరలిస్తారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్‌నాథ్‌ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు