తల్లిని చూడడానికి సైకిల్‌పై 215 కి.మీ

20 Apr, 2020 09:11 IST|Sakshi
తల్లిని కలుసుకున్న తనయుడు

చెన్నై, తిరువొత్తియూరు: కుంభకోణంలో ఉన్న 92 ఏళ్ల తల్లిని చూడడానికి ఓ వ్యక్తి మదురై నుంచి 215 కి.మీ దూరం సైకిల్‌పై రావడం చర్చనీయాంశమైంది. తంజావూరు జిల్లా కుంభకోణం దారాసురాంకు చెందిన జయగంధన్‌ (58) నేత కార్మిక పనులు మూసివేయడంతో నాలుగేళ్లుగా భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి మదురైకి వలస వెళ్లాడు. అక్కడ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లి నన్నబ (92). దారాసురాంలోనే ఉంటోంది.

మదురై నుంచి నెలకొకసారి జయగంధన్‌ కుంభకోణంకు వచ్చి తల్లిని చూసి ఆమెకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను ఇచ్చి వెళ్లేవాడు. కరోనా వైరస్‌ కారణంగా తల్లిని చూడడానికి వీల్లేకుండా పోయింది. గత 16వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటలకు తల్లిని చూడాలని మదురై నుంచి సైకిల్‌పై కుంభకోణానికి బయలుదేరాడు. తిరుపత్తూరు, పుదుకోటై, గందర్వకోటై, తంజావూరు మార్గం గుండా 215 కి.మీ దూరం దాటి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు దారాసురంలో ఉన్న ఇంటికి చేరుకుని తల్లిని చూసి ఉప్పొంగిపోయాడు. మనస్సుకు ఆనందం కలిగిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు