ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస

13 Apr, 2020 18:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి మరోసారి లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదలెవరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరారు. తక్కువ ధరకు ధాన్యం అందించే కేంద్రం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అయితే దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని సెప్టెంబర్‌ వరకూ పొడిగించాలని కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నెలవారీగా ఓ వ్యక్తికి 5కిలోల చొప్పున ఉచితంగా ధాన్యం అందించే పథకం బాగుందని ప్రశంసించారు. లాక్‌డౌన్‌ యొక్క దీర్ఘకాలిక ప్రభావం, ప్రజల జీవనోపాధిలాంటి అన్ని రకాల విషయాలను దృష్టిలో పెట్టుకొని​ ఆమె లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గతంలో కరోనాపై పోరుకు తగిన సూచనలు ఇవ్వాలని ప్రధాని కోరిన నేపథ్యంలో సోనియా కొన్ని సూచనలు చేస్తూ లేఖ వ్రాసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా: భారత్‌లో 9,152 కేసులు.. 308 మరణాలు 

మరిన్ని వార్తలు