సుప్రీం తీర్పు చరిత్రాత్మకం : సోనియా గాంధీ

26 Nov, 2019 11:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇక సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్‌ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు