సింగర్ అత్యుత్సాహం.. ఫ్లైట్ సిబ్బందిపై వేటు

5 Feb, 2016 12:59 IST|Sakshi
సింగర్ అత్యుత్సాహం.. ఫ్లైట్ సిబ్బందిపై వేటు

న్యూఢిల్లీ: గత నెలలో ముంబై నుంచి జోధ్పూర్ కు వెళ్లే విమానంలో ప్రయాణించిన సమయంలో ఓ గాయకుడు తన మధురమైన గాత్రంతో ప్రయాణికులతో పాటు ఎయిర్ హోస్టెస్ సిబ్బందిని థ్రిల్ చేశాడు. సింగర్ సోనూ నిగమ్ పాడిన పాట ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది తెలుసుకున్న జెట్ ఎయిర్ వేస్ ఆ విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. సిస్టమ్ ను దుర్వినియోగం చేశారన్న కారణంగా సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం ఈ శిక్ష ఖరారయింది. విమానంలోని మైక్రోఫోన్ ను ప్రయాణికుల సౌకర్యార్థం అనౌన్స్ మెంట్స్ కోసం మాత్రమే వాడాలని పేర్కొంటూ.. ఇలాంటివి భవిష్యత్తులో ఎప్పుడు పునరావృతం అవ్వరాదని కూడా హెచ్చిరించింది. సింగర్ మైక్రోఫోన్ యూజ్ చేస్తుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

జర్నీలో సాధారణంగా 'సీటు బెల్టు పెట్టుకోండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లాంటి అనౌన్స్ మెంట్లు ప్రయాణికులకు అలవాటే. టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైనపుడు విమాన సహాయకురాలు ఇలాంటి సూచనలను  మైక్ ద్వారా అందించడం కామన్.. అయితే బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తన  మధురమైన కంఠస్వరంతో  ప్రయాణికులను పలకరించాడు. 'వీర్ జారా'లోని దో పల్ రుకో పాట, 'రిఫ్యూజీ'లో మరో పాటనను హమ్ చేశాడు. సోనూ నిగమ్ ను అకస్మాత్తుగా చూసి సంబరపడిపోయిన అభిమానులు కొంతమంది అతడితో పాటు గొంతు కలిపారు. కానీ, ఈ సీన్ అంతా వీడియో తీసీ ఎవరో ఇంటర్ నెట్లో అప్ లోడ్ చేయడం.. ఎయిర్ లైన్స్ దృష్టికి రావడంతో విమాన సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది అసలైన అసహనం..
ఫ్లైట్ సిబ్బందిని సస్పెండ్ చేయడంపై సింగర్ సోనూ నిగమ్ తీవ్రంగా స్పందించాడు. ఇది అసలైన అసహనం అంటూ వ్యాఖ్యానించాడు. కేవలం తాను విమానంలో పాట పాడినంత మాత్రాన విమాన సిబ్బందిని ఇలాంటి చర్యలకు పాల్పడుతారా అని ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు