ఇది మతతత్వ గూండాగిరీ

18 Apr, 2017 02:25 IST|Sakshi
ఇది మతతత్వ గూండాగిరీ

గుళ్లు, మసీదులపై సోనూ నిగమ్‌ వ్యాఖ్య
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు సోనూ నిగమ్‌ గుళ్లు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌడ్‌ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు. ‘గుళ్లు, మసీదులు.. ప్రజలను లౌడ్‌స్పీకర్ల ద్వారా ఎందుకు నిద్ర లేపుతున్నాయో నాకు అర్థం కావడం లేదు.

బలవంతపు మతతత్వాన్ని ప్రజలపై రుద్దడాన్ని ఆపేయాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘దేవుడు అందరినీ ఆశీర్వదించాలి. నేను ముస్లింను కాను. కానీ ప్రతి రోజూ తెల్లవారుజామునే అజాన్‌తో నిద్ర లేస్తున్నాను. దేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడూ అంతమవుతుందో..’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మహ్మద్‌ ప్రవక్త కాలంలో కరెంట్‌ లేదు. ఎడిసన్‌ తర్వాతే ఎందుకు నాకీ గోల (లౌడ్‌స్పీకర్లలో అజాన్‌ ఇవ్వడంపై)’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు