ఇక దేశవ్యాప్తంగా బడిబాట

8 Sep, 2017 17:37 IST|Sakshi
న్యూఢిల్లీః స్కూల్‌ వైపు చూడని చిన్నారులను బడిబాట పట్టించేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ‘స్కూల్‌ చలో అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నట్టు కేం‍ద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా బడికి దూరంగా ఉన్న 80 లక్షల మంది విద్యార్థులను స్కూళ్లలో చేర్పిస్తామని చెప్పారు.
 
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓ సెమినార్‌లో మంత్రి మాట్లాడుతూ స్వాతం‍త్ర్యం లభించినప్పుడు దేశంలో కేవలం 18 శాతంగా ఉన్న అక్షరాస్యత ప్రస్తుతం 81 శాతానికి పెరిగిందన్నారు.అక్షరాస్యతా శాతాన్ని మరింతగా పెంచాలని, ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ 70 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉండటంతో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచేందుకు ఇదే సరైన సమయమన్నారు.
>
మరిన్ని వార్తలు