డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్‌గా సౌమ్య

4 Oct, 2017 02:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ కూతురు సౌమ్య స్వామినాథన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(డీడీపీ–డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రోగ్రామ్స్‌)గా నియమితులయ్యారు.

ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు