పేదరాలి ఇంటికి పెద్దసార్‌

7 Oct, 2019 11:02 IST|Sakshi
టిఫిన్‌ చేస్తున్న ఎస్పీ వేదమూర్తి

గుడిసెలో జొన్నరొట్టె తిన్న ఎస్పీ  

రాయచూరు రూరల్‌: ఓ ఐపీఎస్‌ అధికారి అనుకుంటే ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి టిఫిన్‌ వస్తుంది. పెద్ద పెద్ద చెఫ్‌లు వండిపెడతారు. కానీ ఆ ఎస్పీ ఓ చిన్న పూరిగుడిసెలో ముసలమ్మ చేసిన టిఫిన్‌ను పూరెగుడిసెలో ఆరగించి అందరినీ అబ్బురపరిచారు. జనంతో మమేకం కావడం ఎలాగో చూపించారు. ఆదివారం కర్ణాటకలో రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో ఎస్పీ వేదమూర్తి ఆధ్వర్యంలో యువత, ఉద్యోగులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. పాడుబడ్డ బావిని శుభ్రం చేసి, దాని చుట్టూ మొక్కలు నాటారు.

ఎస్పీ వేదమూర్తి గ్రామంలో సంచరిస్తున్న సమయంలో పాలమ్మ (70) అనే వృద్ధురాలు ఆయనకు నమస్కారం చేసింది. బాగున్నావా అమ్మా అని ఎస్పీ ఆమెను పలకరించారు. ఉదయం ఏమైనా తిన్నారా?, తింటావా అని ఆమె ఎస్పీని ప్రశ్నించింది. ఎస్పీ సరేనంటూ ఆమె పూరిపాకలోకి వెళ్లారు. పాలమ్మ ఇచ్చిన జొన్నరొట్టే, శనగపిండి కూరని తిన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు