మీరు మనుషులేనా? ఎక్కడ ఏమి అడగాలో తెలియదా?

7 Jul, 2019 10:29 IST|Sakshi

మీడియా ప్రతినిధులపై స్పీకర్‌ చిర్రుబుర్రు   

సాక్షి. బెంగళూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్క సారిగా అసమ్మతి తలెత్తడంతో పాటు శనివారం ఒక్క రోజే 10 మంది  అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రావడం, దీనిపై శాసనసభ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను అడగడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నగరంలోని జయదేవ ఆస్పత్రిలో ఆయన బంధువు ఒకరిని పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చారు. దీంతో రాజీనామాలపై ఏమైనా మాట్లాడతారేమోనని మీడియా ప్రతినిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

చదవండి: కన్నడ సంక్షోభం

ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్‌ మండిపడ్డారు. మీరు మనుషులా, ఎక్కడ ఏమి అడగాలో తెలియదా?, నా దగ్గరి బంధువు ఆస్పత్రిలో ఉంటే చూడటానికి వస్తే ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అని ఆగ్రహించారు. ఆస్పత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వస్తే మీకూ వార్తలు కావాలా?, మీరు మనుషులా, కాదా అని వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు ఆవేదనకు లోనయ్యారు. ఇలా దూషించడం తగదని పలువురు వ్యాఖ్యానించారు.  

>
మరిన్ని వార్తలు