నిన్నటి.. ఆ అడుగు జాడలు...

2 Oct, 2019 04:04 IST|Sakshi

మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాందీగాదక్షిణాఫ్రికా వెళ్లిన గాందీజీ... ఉద్యమకారుడిగా తిరిగి వచి్చన నాటి నుంచి వేసిన అడుగులు చరిత్ర గతినే మార్చేశాయి. ‘రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చివరికి వారు ని్రష్కమించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. చంపారణ్‌లో రైతుల కోసం మొదలుపెట్టిన తొలి ఉద్యమం అనంతరకాలంలో ఎన్నో కీలక ఘట్టాలకు స్ఫూర్తినిచి్చంది. దేశానికి మహాత్ముణ్ణి అందించింది. బ్రిటిష్‌ పాలకులకు ఊపిరాడనీయకుండా చేసిన ఉద్యమాల పరంపర 1948 జనవరి 30న ఉన్మాది తూటాలకు గాంధీజీ నేలకొరిగే వరకూ సాగుతూనే ఉంది. ఆయన ప్రస్థానంలోని ముఖ్యమైన అడుగుల జాడలివి...

జనవరి 9/1915 స్వదేశానికి మహాత్ముడు
దక్షిణాఫ్రికాలో నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌కు సారథ్యం వహించి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాక భారత్‌కు తిరిగొచి్చన రోజు.

ఏప్రిల్‌ 17/1917 చంపారణ్‌ సత్యాగ్రహం
బిహార్‌లోని చంపారణ్‌లో బార్లీ బదులు నీలిమందు తోటల్ని పెంచాలన్న బ్రిటిష్‌ పాలకుల హుకుంను నిరసిస్తూ రైతులకు మద్దతుగా గాంధీ తొలి సత్యాగ్రహం. అనంతరకాల సత్యాగ్రహ ఉద్యమాలకు ఇదే స్ఫూర్తి.
మార్చి 18/1918 ఖేడా ఉద్యమం
ఒకపక్క ప్లేగు వ్యాధి, మరోపక్క కరువు పీడిస్తున్న గుజరాత్‌లోని ఖేడాలో అధిక పన్నులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం. లొంగివచ్చిన ప్రభుత్వం.

ఏప్రిల్‌ 6 1919 రౌలట్‌ నిరసనోద్యమం
జాతీయోద్యమంపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు. నిరసనగా సత్యాగ్రహం.జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ. వెయ్యిమంది మృతి.

మార్చి 12/1930 ఉప్పు సత్యాగ్రహం
జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కీలక సత్యాగ్రహం. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 384 కిలోమీటర్ల దూరంలోని దండికి గాం«దీజీ ప్రారంభించిన పాదయాత్ర. యాత్ర చివరిలో ఉప్పుపై ప్రభుత్వం విధించిన ఆంక్షల ఉల్లంఘన. గాందీజీ, ఇతర నేతల అరెస్టు.

మార్చి 5/1931 గాంధీ–ఇర్విన్‌ ఒడంబడిక
భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా కాంగ్రెస్‌ కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలు, కార్యకర్తలపై సాధారణ కేసుల ఉపసంహరణ. దండి యాత్రలో పాల్గొన్న వారి విడుదల.

1934 కాంగ్రెస్‌కు రాజీనామా
కాంగ్రెస్‌లో సహచర నేతలతో విభేదాలు. పారీ్టకి గాంధీ రాజీనామా. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీ దీక్ష చేపట్టాక పుణేలో దళితుల తరఫున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, అగ్రవర్ణాల తరఫున మదన్‌మోహన్‌ మాలవీయల మధ్య ఒప్పందం. అనంతరకాలంలో అగ్రవర్ణాలకు అనుకూలమంటూ వచి్చన నిందల పర్యవసానంగా పారీ్టకి రాజీనామా. 1937లో పార్టీ నేతల వినతితో తిరిగి చేరిక.

ఆగస్టు 8 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం
భారత్‌కు అధినివేశ ప్రతిపత్తి ఇస్తామంటూ క్రిప్స్‌ రాయబారం. కాంగ్రెస్‌ తిరస్కరణ. స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాక గాంధీతోపాటు పలువురు నేతల అరెస్టు. బ్రిటిష్‌ పాలకులు దేశం వదిలిపోవాలంటూ ఆగస్టులో క్విట్‌ ఇండియా ఉద్యమం.

ఆగస్టు 15/1947 స్వాతంత్య్ర భానూదయం
దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించి ఇరు దేశాలకూ స్వాతంత్య్రం ప్రకటిస్తూ ప్రకటన.

జనవరి 30 /1948 మహాభి నిష్క్రమణం
హిందువుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రార్థనా సమావేశంలో ఉన్న గాం«దీజీని కాల్చి చంపిన దుండగుడు నాథూరాం వినాయక్‌ గాడ్సే.  

►గాంధీజీకి తొలి సంతానంగా ఒక పాప పుట్టి మూడు నాలుగు రోజులకే చనిపోయింది. తాను చేసిన తప్పునకు దేవుడు విధించిన శిక్షగా భావించి దాన్ని అంగీకరించారు.

►నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్న ఐదుగురు నేతలు– మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ (అమెరికా), నెల్సన్‌ మండేలా (దక్షిణాఫ్రికా), అడాల్ఫో పెరెజ్‌ ఎస్క్వవెల్‌(అర్జెంటీనా), దలైలామా (టిబెట్‌), ఆంగ్‌సాన్‌ సూకీ (మయన్మార్‌)– తమ మీద గాంధీజీ ప్రభావం ఉందని చెప్పుకున్నారు.

►రచయితలు, చింతనాపరులు జాన్‌ రస్కిన్‌ (బ్రిటన్‌), లియో టాల్‌స్టాయ్‌ (రష్యా), ఎడ్వర్డ్‌ కార్పెంటర్‌ (బ్రిటన్‌) రచనల వల్ల అమితంగా ప్రభావితం అయ్యారు గాంధీజీ. వాళ్లను తన గురుతుల్యులుగా పేర్కొన్నాడు.

నేటికీ.. అవసరం

ఆయన్ను జార్జి బెర్నార్డ్‌ షా హిమాలయాలతో సరిపోల్చాడు... మహామేధావి ఐన్‌స్టీన్‌కైతే ప్రపంచ రాజకీయవేత్తల్లో ఏకైక వివేకవంతుడిగా కనబడ్డాడు... మారి్టన్‌ లూథర్‌కింగ్‌కు ఆయన క్రీస్తు... బరాక్‌ ఒబామాకు నిజమైన హీరో... మొత్తంగా అందరికీ మహాత్ముడు!

ఒక అమ్మ కడుపున జన్మించి మూడు యాభైలు గడిచినా ఇప్పటికీ దేశంలోనే కాదు ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నాడంటే ఆయన నిస్సందేహంగా అసాధారణ మానవుడు. అప్పుడు నెల్సన్‌ మండేలాకైనా, ఆ తర్వాత కాలంలో మారి్టన్‌ లూథర్‌కింగ్‌కైనా, పదేళ్ల కిందట అరబ్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టి నియంతలను గడగడలాడించిన ‘జాస్మిన్‌ విప్లవానికైనా, ఇప్పుడు మనకళ్లముందు సాగుతున్న హాంకాంగ్‌ హక్కుల ఉద్యమానికైనా మహాత్ముడే వెలుగు కిరణాలు విరజిమ్మిన మార్తాండుడు. కాలావధులు దాటి నిరంతరాయంగా స్వేచ్ఛా పరిమళాలను వెదజల్లే బలమైన ప్రభావం. నిన్నమొన్న ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఒక పాఠశాల కుర్రాడు ఆయుష్‌ చతుర్వేది చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గాందీజీ వర్తమాన అవసరాన్ని నొక్కిచెప్పింది. బక్కపలచగా, ఒంటిపై అంగవస్త్రం తప్ప మరేమీ లేకుండా సర్వసంగ పరిత్యాగిలా కనబడే మహాత్మాగాం«దీలో ఏమిటింత గొప్పతనం? ఆయనంటే ఈనాటికీ ఎందుకింత ఆరాధన? ఇదేమిటి... మనమధ్య నుంచి ని్రష్కమించి ఏడు పదులు గడుస్తున్నా ఇంకా ఆయనను భిన్న కోణాల్లో దర్శిస్తూ, కొత్తకొత్తగా విశ్లేíÙçస్తూ, ఆయన మూర్తిమత్వాన్ని కళ్లకు కడుతూ ఏడాదికో, రెండేళ్లకో పుస్తకాలు వెలువడటమేమిటి? వింతగా లేదూ...?! ఆయనకంటే నాలుగైదేళ్ల తర్వాతే కావొచ్చుగానీ మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించాక గాం«దీజీ రాజకీయాలను, ఆయన ఉద్యమ నిర్వహణ తీరును కమ్యూనిస్టు పార్టీ పలు సందర్భాల్లో నిశితంగా విమర్శించింది.

ఆయన వేస్తున్న అడుగులు సరికాదని హెచ్చరించింది. ఆ ఎత్తుగడలన్నీ సామ్రాజ్యవాదులకే అంతిమంగా ఉపయోగపడతాయన్నది. కానీ అది రష్యా తరహాలో ఇక్కడొక లెనిన్‌ను సృష్టించుకోలేకపోయింది. చైనాలో మావోలా విప్లవోద్యమ సారథికి పురుడు పోయలేకపోయింది. వియత్నాంలో వలే ఇక్కడ హోచిమిన్‌ జాడలేదు. దశాబ్దం క్రితం మన పొరుగునున్న నేపాల్‌ మాదిరి రాచరికాన్ని కూలదోసిన ‘ప్రచండ’ కూడా లేడు. కానీ గాంధీజీ అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు. ఐదు దశాబ్దాల క్రితం మార్క్సిస్టు దిగ్గజం నంబూద్రిపాద్‌ ఓ మాటన్నారు. భారత రాజకీయాల్లో గాంధీజీ పాత్రను సరిగా విశ్లేషించుకొని, సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోవడమే కమ్యూనిస్టుల వైఫల్యానికి ప్రధాన కారణమని వివరించారు. గాం«దీజీ మూలాలు గ్రామీణ భారతంలో, అక్కడి జీవనంలో పెనవేసుకుపోయి ఉన్నాయన్నది నంబూద్రిపాద్‌ విశ్లేషణ. కనుకనే అప్పుడప్పుడూ వెనక్కి తగ్గినట్టు కనబడినా, ఎదురుదెబ్బలు తప్పకున్నా మొత్తంగా గాంధీజీ పురోగమనశీలిగా, లక్ష్య సాధకుడిగా రూపుదిద్దుకున్నాడని ఆయన వివరించారు.గాందీజీ ఉద్యమనాయకుడు మాత్రమే కాదు... ఆవిర్భవించబోయే రేపటి భారతానికి ముందే సిలబస్‌ తయారు చేసిన దార్శనికుడు. ఆయన ప్రవచించిన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ, గ్రామ స్వరాజ్యం ఈనాటికీ శిరోధార్యాలు. ఆయన స్పృశించని అంశం లేదు. అందులో స్త్రీ, పురుష సమానత్వం, సంçస్కృతి చదువు, నిరాడంబరత, సత్యాహింసలు, ఆధ్యాత్మికత, నైతిక విలువలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, కులమత వివక్షలు, భాష తదితరాలన్నీ ఉన్నాయి.

ఆయన దృష్టికోణం నుంచి తప్పుకున్నదేదీ లేదు. సమస్త అంశాలూ ఆయన అధ్యయనం చేశాడు. సరైన దోవ ఏదో చెప్పాడు. అవతలివారి అభిప్రాయాలకు విలువనిచ్చాడు. ఒక్కోసారి వాటికి అనుగుణంగా తానూ మారాడు. అవతలివారి ఆచరణను చూశాడు. అందులో నేర్చుకోదగినవాటిని స్వీకరించాడు. స్వాతంత్య్రం సిద్ధించాక పాలకులు వాటిని విస్మరించి ఉండొచ్చు. కొన్నిటిని నామమాత్రంగా అమలు చేస్తూండొచ్చు. సమాజంలో చివరాఖరి సాధారణ మానవుడికి సైతం అభివృద్ధి ఫలాలు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్య్రం అవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు గాం«దీజీ. అన్నిటికన్నా పేదరికమే అత్యంత హీనమైన హింస అని చెప్పాడు. ‘మనకో, మనకు తెలిసినవారికో అనుకోనిది ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ అంతమాత్రాన మానవత్వంపై విశ్వాసం పోగొట్టుకోవద్దు’ అని హితవు చెప్పాడు. కొన్ని చుక్కల నీరు కల్మషమైతే సముద్రం చెడిపోయినట్టేనా అని ప్రశ్నించాడు. మన వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ప్రవర్తనను, చదువులను, కొలువులను, పాలననూ, పద్ధతులను గాంధీ కొలమానంలో ఎప్పటికప్పుడు చూసుకుంటేనే... చూసి సరిచేసుకుంటేనే ఈ దేశం సవ్యంగా మనుగడ సాగించగలదని పదేపదే రుజువవుతోంది.
– డా. నాగసూరి వేణుగోపాల్‌

మరిన్ని వార్తలు