జగనన్నకు దిగ్విజయోస్తు

6 Nov, 2017 08:54 IST|Sakshi

అన్న వస్తున్నాడు.. రాజన్న రాజ్యం తెస్తున్నాడు

ప్రజా సంకల్పయాత్రతో ప్రజాకంటక పాలనకు భరతవాక్యం

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్రపై తెలుగువారి హర్షం

నవశకానికి నాంది పలకాలని ఆకాంక్ష

ఎటుచూసినా రాబందుల రెక్కల చప్పుడు, దోపిడీదొంగల వికటాట్టహాసాలు. సామాన్య జనం నలిగిపోతున్నారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, చవక క్యాంటీన్లు, నిరుద్యోగులకు నెలనెలా భృతి, రైతులకు, చేనేత కార్మికులకు, వారికి వీరికీ అవి ఇవీ ఇస్తాం, అన్నీ చేస్తాం అని ఎన్నికల్లో బూటకపు హామీలు. చివరకు జరిగిందేమిటి? నిత్యం అన్నదాతల ఆత్మహత్యలు, వృత్తికార్మికుల ఆకలి కేకలు. నిరుద్యోగ యువత హాహాకారాలు. అందరి ఇంటా ఆర్తనాదాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పరిపాలనలో ప్రజల దైన్యం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేనున్నానంటూ... వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు (సోమవారం) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రకు నడుం బిగించారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి వారి బాగోగులు తెలుసుకుని ఓదార్చి, రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని భరోసా ఇవ్వబోతున్నారు. ఆయన ప్రజాసంకల్ప యాత్రపై కన్నడనాట విశేష ఆసక్తి వ్యక్తమవుతోంది. యాత్ర దిగ్విజయం కావాలని తెలుగువారు నిండుమనసుతో వాంఛిస్తున్నారు.         

జగనన్నను ఆశీర్వదించండి
వైఎస్‌.జగన్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపు రం దాకా తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పట్టి తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టించాలి.– బాబు, బనశంకరి

మేలిమలుపు యాత్ర
వైట్‌ఫీల్డ్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్ర జాసంకల్ప యాత్ర ఏపీ రాజకీయాల్లో మేలుమ లుపు. జన హృదయ దర్శ నం కోసం సంకల్పించిన ఈ యాత్ర అన్నివిధాలా విజయవంతం అవుతుంది. ఏపీలో నెలకొ న్న చంద్రబాబు నిరంకుశ పాలనకు ఈ యాత్ర చరమగీతం పాడుతుంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు ప్రలోభపరచడాన్ని జనం గమనిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వున్న తెలుగువారు, ఐటి ఉద్యోగులు జగన్‌ పాలన కో సం ఎదురు చూస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీకి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సంకల్ప యాత్రలో మా కర్తవ్యంగా మేం కూడా పాల్గొంటున్నాం.-శ్యామ్‌ కలకడ, వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ ప్రధాన కార్యదర్శి

రాక్షస పాలనకు చరమగీతం
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపు రం వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర తో అధికార తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందు కే పనికిరాని విమర్శలకు పాల్పడుతున్నారు. సంకల్పయాత్ర పూర్తయ్యే నాటికి తెలుగుదేశం పార్టీ పతనం తప్పదు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్ర జాప్రస్థానం పాదయాత్రతో తెలుగుదేశం ఆటవిక పరి పాలన ఎలా మట్టికరించిందో, ఇప్పుడు జగనన్న ప్ర జాసంకల్ప యాత్రతో తెలుగుదేశం పతనం ఖాయం.   – రంజిత్‌కుమార్, లగ్గెరె

స్వర్ణయుగానికి నాంది కావాలి
ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజలతో మమేకమై రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మట్టికరిపించి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ స్వర్ణ యుగ పరిపాలనకు నాంది పలకాలి. చంద్రబాబు  పాలనలో అన్నివర్గాల ప్రజలు విసుగుచెందారు. మా యమాటలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇ చ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దొంగ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు కు తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది. ప్ర జాసంకల్ప యాత్రలో రాష్ట్రంలోని అన్నివర్గాల వారు సంపూర్ణ మద్దతు పలికి జగనన్నను ఆశీర్వదించాలి. డి.మంజునాథ్, లగ్గెరె

తెలుగుదేశానికి చెమటలు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలను మోసం చేస్తూ రాజధాని పేరుతో అ క్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి యువ నేత పాదయాత్ర ద్వారా ప్రజ ల్లోకి రావడం సంతోషంగా ఉంది. ప్రజా సంకల్ప యా త్రని ప్రకటించిననాటి నుంచి తెలుగు దేశం నాయకులకు చెమటలు పడుతున్నాయి. త్వరలోనే తెలుగునాట రాజన్న రాజ్యం మళ్లీ  అధికారంలోకి వస్తుంది. జగనన్నను సీఎం చేయడానికి తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు.-బీ.ఎల్‌.ఉపేంద్రరెడ్డి (హెబ్బాళ)

మద్దతు పలుకుతాం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపడుతు న్న ప్రజా సంకల్పయాత్రను తెలు గు ప్రజలు తప్పకుండ ఆదరిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు చాటడానికి సాగుతున్న యువనేతను తెలుగు ప్రజలు స్వా గతించడంతో పాటు మునుముందు రోజుల్లో పచ్చపార్టీకి బుద్ధి చెప్పడం త థ్యం.ఇందుకోసంతెలుగుప్రజలు ఎదురుచూస్తున్నా రు.యువనేత చేపడుతున్న పాదయాత్రకు త్వరలోనే బెంగళూరు నుంచి సైతం ప్రవాసాం ధ్రులు పెద్దసంఖ్య లో తరలివెళ్లి మద్దతుపలుకుతాం. 
– వైఎస్సార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి

జగన్‌తోనే రైతురాజ్యం
అరకొర రుణమాఫీతో రైతులను చంద్రబాబుపూర్తిగా మోసం చేశారు. రైతు పక్షపాతి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే రైతు రాజ్యం వస్తుంది. ప్రజా సంకల్ప యా త్ర ద్వారా రైతులు, యువత, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు వాటి పరి ష్కారానికి నూతన పథకాలు ప్రవేశపెడతారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంలో ఆయన కు ఆయనే సా టి. ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. – శివశంకర్‌ రెడ్డి (యలహంక)

పెరుగుతోన్న ఆదరణ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి ఆ యాత్ర జరగకుండా చేయాల ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో కుతంత్రాలు చేశారు. ప్రజల గుండెల్లో నిలి చిపోయిన దివంగత నేతను ఎవరూ చెరపలేరు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రజల దగ్గరకు వెల్లకుండా ఆపడం ఎవరి తరం కాదు. ప్రజా సమస్యలపై పోరాటాలతో రోజు రోజుకు ప్రజల్లో జగన్‌కు ఆదరణ పెరుగుతోంది. – సోమశేఖర్‌ రెడ్డి (యలహంక)

రైతురాజ్యం కోసం ఎదురుచూపులు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యా త్ర చేపడతామని అన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.పాదయాత్ర తప్పకుండా విజయవంతం అవుతుం ది. ఇందుకోసం తెలుగు ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యువనేత పాదయాత్రతో తెలుగుదేశం పతనం మొదలవుతుంది. రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డాక్టర్‌. వైఎస్సార్‌రైతురాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.- ఎస్‌.పి.సురేష్‌కుమార్, డాక్టర్‌. వైఎస్సార్‌ కర్ణాటక యువ వేదిక అధ్యక్షుడు  

దిగ్విజయమే  
చంద్రబాబు నేతృత్వంలో ఆంద్రప్రదేశ్‌లో తెలుగుదేశం నాయకులు పాల్పడుతున్న అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి యువ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆరునెలల పాటు అలుపెరగకుండా చేపడుతున్న పాదయాత్ర దిగ్విజయం అవుతుంది. తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతన్న రాజ్యం యువ నేత నాయకత్వంలో సాకారమవుతుంది. తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ యువనేత పాదయాత్రను ఆదరించాలి.-బీ.మోహన్‌కుమార్‌ (బొమ్మనహళ్లి)

అన్నొస్తున్నాడని చెప్పండి
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రకు కన్నడనాట అపూర్వ సంఘీభావం వ్యక్తమవుతోంది. జగనన్న పాదయాత్ర విజయవంతం కావాలని, మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు