లాక్‌డౌన్‌: ఇంట్లో పెళ్లి చేసుకున్న‌ దివ్యాంగులు

8 May, 2020 09:01 IST|Sakshi

జోధ్‌పూర్‌: పెళ్లంటే క‌ల‌కాలం గుర్తుండిపోయే ఓ మ‌ధుర జ్ఞాప‌కం. అయితే గుడ్డొచ్చి పిల్ల‌ను వెక్కిరించిన‌ట్లు క‌రోనా వ‌చ్చి పెళ్లిళ్ల‌ను వెక్క‌రిచింది. తానుండ‌గా వివాహాది శుభ‌కార్యాలు జ‌రిగేది లేదంది. దీంతో వంద‌లాది వివాహాలు వాయిదా ప‌డ్డాయి. కానీ కొంత‌మంది మాత్రం అనుకున్న ముహూర్తానికే పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని మంకుప‌ట్టి ప‌డుతూ మ‌రీ మ‌నువాడుతున్నారు. తాజాగా రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ దివ్యాంగుల‌‌ జంట కూడా ఇప్ప‌ట్లో క‌రోనా పోయిలా లేదుగానీ అనుకుని గురువారం నాడు కుటుంబ స‌భ్యుల మధ్య సంతోష‌క‌రంగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంది. (కల్యాణానికి కరోనా సెగ)

అటు పురోహితుడు మాస్కు క‌ట్టుకునే మంత్రాలు ఉచ్ఛ‌రించాడు. ఇటు వ‌ధూవ‌రుల‌తోపాటు కుటుంబ స‌భ్యులు కూడా మాస్కులు ధ‌రించారు. సుబోధ్ డేవ్ మాట్లాడుతూ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూనే వివాహం జ‌రిపామ‌ని వెల్ల‌డించారు. కొన్ని నెల‌ల క్రిత‌మే పెళ్లి ముహూర్తం ఖ‌రారు చేసుకున్నామ‌ని, అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామ‌న్నారు. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల వేడుక‌లు క్యాన్సిల్ చేసుకుని నిరాడంబ‌రంగా వివాహం జ‌రిపామ‌ని తెలిపారు. కాగా లాక్‌డౌన్ ఇప్ప‌టికి మూడు సార్లు పొడిగించిన తెలిసిందే. ప్ర‌స్తుతం కేంద్రం విధించిన లాక్‌డౌన్ మే 17 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. (మాస్క్‌ లేకుంటే జరిమానా  రూ. 1,000)

మరిన్ని వార్తలు