ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూత

12 Jul, 2018 15:08 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్రమోదితో ఆధ్యాత్మిక గురువు దాదా జేపీ వస్వాని

పుణె : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా జేపీ వస్వాని కన్నుమూశారు. సోమవారం తన 99వ ఏట పుణెలో మరణించారు. దాదా వస్వాని 1918 ఆగస్టు2న పాకిస్తాన్‌ సింధ్‌ ప్రాంతంలోని హైదరబాద్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు జస్వాన్ పహ్లజ్ రాయ్ వస్వాని. శాఖాహారాన్ని, జంతు హక్కులను  ప్రచారం చేయటానికి ఆయన కృషిచేశారు. ఇందుకోసం ‘‘సాధూ వస్వాని మిషన్‌’’ పేరిట ఓ ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన దాదాపు 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించారు.

ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి యూనైటెడ్‌ నేషన్స్‌ ‘‘యూ తంత్‌ పీస్‌ అవార్డ్‌’’ను బహుకరించింది. ఆయన పుట్టిన రోజును ‘‘గ్లోబల్‌ ఫర్గివ్‌నెస్‌ డే’’గా  జరుపుకుంటున్నారు. వస్వాని  ‘‘బ్రిటీష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’’ లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌లోని ‘‘గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ స్పిరిచువల్‌ లీడర్స్‌’’ తదితర ప్రముఖ ప్రదేశాలలో తన ప్రసంగాన్ని వినిపించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోది, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు