అర్ధ‌రాత్రి చిరుత నుంచి త‌ప్పించుకుని...

10 May, 2020 17:15 IST|Sakshi

ముంబై: అర్ధ‌రాత్రి భ‌యంక‌ర శ‌బ్ధాలు విన‌డంతో నిద్ర‌లో నుంచి ఉలిక్కి ప‌డి లేచిన‌ కుటుంబం ఎదురుగా ఉన్న జంతువును చూసి షాక్‌కు గురైంది. ఓ ప‌క్క‌గా జింక బిక్కుబిక్కుమంటూ కూర్చుండ‌టం చూసి వారు అధికారుల‌కు స‌మాచారమిచ్చారు. ఈ అరుదైన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని పోవాలి ప్రాంతంలో ఆదివారం ఉద‌యం ఒంటి గంట స‌మ‌యంలో ఓ మ‌చ్చ‌ల జింక త‌న‌ను వేటాడుతున్న చిరుత నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో పై క‌ప్పు నుంచి ఓ ఇంట్లో ప‌డింది. అప్ప‌టికీ ఆ పులి దాన్ని వ‌దిలిపెట్టకుండా వేటాడేందుకు ప్ర‌య‌త్నించింది. ఆ ఇంటి పైక‌ప్పుపై దాడికి దిగి అనంత‌రం వెనుదిరిగి వెళ్లిపోయింది. (వైరల్‌ : ఇదేం వింత స్నేహం?!)

ఈ శ‌బ్ధాల‌కు నిద్ర‌లో నుంచి ఉలిక్కి ప‌డిన లేచిన కుటుంబ స‌భ్యులు ఎదురుగా ఉన్న‌ మ‌చ్చ‌ల జింక‌‌ను చూసి స్థానువులైపోయారు. అనంత‌రం అట‌వీ శాఖ‌ అధికారుల‌కు స‌మాచార‌మివ్వ‌గా వారు వెంట‌నే అక్క‌డికి చేరుకుని జింక‌ను ర‌క్షించి సంజ‌య్ గాంధీ జాతీయ పార్కుకు త‌ర‌లించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో జింక ఎటూ క‌ద‌ల‌కుండా ఒకేచోట‌ కూర్చుని ఉంది. ఈ ఘ‌ట‌న గురించి అట‌వీ అధికారి సంతోష్ కంక్ మాట్లాడుతూ.. ఇత‌ర జంతువు జింక‌ను వేటాడ‌టంతో అది పైక‌ప్పు మీద నుంచి ఇంట్లో ప‌డింద‌ని పేర్కొన్నారు. (డేంజర్‌.. ఆ బ్రిడ్జి మీదకు వెళ్లకండి!)

మరిన్ని వార్తలు