భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

13 Nov, 2015 16:50 IST|Sakshi
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దుచేయడంతో కొన్ని రైళ్లను చెన్నై మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు అధికారికంగా వెల్లడించారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా 55 మంది మృతిచెందిన విషయం అందరికి విదితమే. రాజధాని చెన్నై నగరంలో పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించారు. వర్షాల కారణంగా ఈ ఆదివారం నుంచి పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రద్దయిన కొన్ని రైళ్లు:
చెన్నై సెంట్రల్- విజయవాడ జన శతాబ్ది ట్రైన్ నెంబర్. 12077, చెన్నై నుంచి తిరుగుప్రయాణం కావలసిన ట్రైన్ 12078, బెంగళూరు-చెన్నై సెంట్రల్ ట్రైన్ నెంబర్. 12640 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. పట్నా-బెంగళూరు ఎక్స్ప్రెస్, గువహతి-తిరువనంతపురం ఎక్స్ప్రెస్, తిరువనంతపురం షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను చెన్నై సెంట్రల్ మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా దారి మళ్లిస్తున్నారు.

మరిన్ని వార్తలు